ఢిల్లీ: పార్లమెంట్ లోక్ సభలో సోమవారం విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ ఎంపిగా కేశినేని శివనాథ్ (చిన్ని) తో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణం చేయించారు. తన ప్రమాణాన్ని కేశినేని శివనాథ్ అను నేను అంటూ తెలుగులో చేశారు. తన పేరు పిలవగానే కేశినేని శివనాథ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా తో పాటు సభలోని సభ్యలందరికీ నమస్కరిస్తూ పోడియం దగ్గరకు వెళ్లారు.
కేశినేని శివనాథ్ విజయవాడ పార్లమెంట్ స్థానానికి 13వ పార్లమెంట్ సభ్యుడిగా 2 లక్షల 82 వేల 85 ఓట్ల భారీ మెజార్టీ తో విజయాన్ని సాధించటం జరిగింది. భారీ మెజార్టీ సాధించిన తొలి ఎంపి గా విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో చరిత్ర సృష్టించారు.
కేశినేని శివనాథ్ కి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 1,20,714 ఓట్లు, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 1,29,278 ఓట్లు, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 1,08,529 ఓట్లు, మైలవరం నియోజకవర్గంలో 1,35,194 ఓట్లు, నందిగామ నియోజకవర్గంలో 98,372 ఓట్లు, జగ్గయ్య పేటలో 95,232 ఓట్లు, తిరువూరునియోజకవర్గంలో 97, 403 ఓట్లు రాగా, పోస్టల్ బ్యాలెట్ రూపంలో 9, 432 ఓట్లు రావటం జరిగింది. మొత్తంగా 7 లక్షల 94 వేల 154 ఓట్లు పోల్ అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రమాణ స్వీకారాన్నిలైవ్ లో చూసి ప్రజలతో పాటు ఎన్డీయే నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు.