లొంగిపోయేందుకు సిద్ధమైన కేతిరెడ్డి, అనుచరులు

అనంతపురం: తాడిపత్రి అల్లర్ల కేసులో నిందితుడిగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఎస్పీకి సమాచారం ఇచ్చిన ఆయన తన 38 మంది అనుచరులతో లొంగిపోనున్నట్లు తెలిసింది. పోలింగ్‌ రోజు, తర్వాత జరిగిన అల్లర్లలో నిందితులుగా పెద్దారెడ్డి, ఆయన అను చరులపై కేసు నమోదైన విషయం తెలిసిందే.