Mahanaadu-Logo-PNG-Large

తెలుగురాష్ట్రాల కేంద్రమంత్రులకు కీలక శాఖలు

తెలంగాణ/అమరావతి: మూడోసారి కొలువు దీరిన ప్రధాని మోదీ క్యాబినెట్‌లో ఈసారి ఎన్నడూ లేని విధంగా తెలుగురాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులకు కీలక శాఖలు కేటాయించారు. తెలంగాణకు చెందిన కిషన్‌ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ… బండి సంజయ్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రామ్మోహన్‌ నాయుడుకు పౌర విమాన యాన శాఖ, శ్రీనివాసవర్మకు భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా…. పెమ్మసాని చంద్రశేఖర్‌కు గ్రామీణాభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్‌ సహాయ మంత్రిగా శాఖలు కేటాయించారు.