అనిల్‌ కుటుంబానికి కొడాలి నాని ఆర్థిక సాయం

గుడివాడ: నియోజవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని ఓటమిని తట్టుకో లేక సైదేపూడి గ్రామానికి చెందిన పిట్ట అనిల్‌ అనే వాలంటీర్‌ ఆత్మహత్య చేసు కున్న విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని అనిల్‌ కుటుంబ సభ్యులను కొడాలి నాని పరామర్శించారు. అంతేకాకుండా రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును కుటుంబసభ్యులకు అందజేశారు. భవిష్యత్తులోనూ కుటుంబానికి అండ గా ఉంటానని భరోసా ఇచ్చారు.