– ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్
అమరావతి, మహానాడు: కోల్‌కతా వైద్య విద్యార్థినికి వేగంగా, నిర్ణయాత్మకంగా, ఆదర్శప్రాయంగా ఉండేలా న్యాయం జరగాలని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన హత్యాచార ఘటనను లోకేష్ ఖండించారు. ఈ దారుణం తలుచుకుంటే మాటలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలికి, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను కోరారు. భారత మహిళల భద్రత, గౌరవాన్ని రక్షించేందుకు ఐక్యంగా ఉందాం. .. ఇది అందరి పోరాటం అని సోషల్ మీడియా వేదికగా లోకేష్ పిలుపునిచ్చారు.