Mahanaadu-Logo-PNG-Large

హరీష్‌రావుపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ట్యాపింగ్‌ దొంగ ప్రభాకర్‌ అమెరికాలో ఉన్నాడు
ప్రభాకర్‌ను కలిసేందుకే హరీష్‌రావు అమెరికా వెళ్లారు
ఇప్పట్లో తెలంగాణకు రావొద్దని చెప్పొచ్చారు
నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి
ఏ విమానంలో వెళ్లారో.. ఎక్కడ కలిశారో నిరూపిస్తా
ప్రభాకర్‌రావును కలవలేదని హరీష్‌ ప్రమాణం చేస్తారా?
నేను దేనికైనా సిద్ధమేనని సవాల్‌

హైదరాబాద్‌: మాజీ మంత్రి హరీష్‌రావుపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ దొంగ ప్రభాకర్‌ను కలిసేందుకే హరీష్‌రావు అమెరికా వెళ్లారని ఆరోపించారు. తాము చట్టపరంగా పోరాటం చేసి ఆయన ఎక్కడ ఉన్నా పట్టుకువస్తామని తెలిపారు. ప్రభాకర్‌రావును హరీష్‌రావు కలవలేదని ప్రమాణం చేస్తారా అని ప్రశ్నించారు. రామేశ్వర్‌రావుకు 7 వేల ఎకరాలు కట్టబెట్టారు. ఆంధ్ర వాళ్ల పాలనలో బెదిరించుకు బతికినం కానీ.. ఫోన్‌ ట్యాపింగ్‌ చేసి వ్యాపారులను బెదిరించాడు. 16 సీట్లలో డిపాజిట్‌ కూడా ఎందుకు పోతుందో కేసీఆర్‌ తెలుసుకోవాలి. మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ ఉన్న లోకల్‌ బాడీలో ఆ పార్టీ నేతలు ఎక్కువ ఉన్నారు. డబ్బులు పెట్టి గెలిచే పద్ధతి కాదు మాది. ఎగ్జిట్‌ పోల్‌ను ఎగ్జాట్‌ పోల్‌గా చూడలేమని వ్యాఖ్యానించారు. ఎక్కువ తక్కువ రావొచ్చు. కాంగ్రెస్‌ మాట మీద ఉంటుం దని రైతులు నమ్ముతున్నారు..మేడిగడ్డ రేపో మాపో పొయ్యేదేనని పేర్కొన్నారు.