పల్నాడు కలెక్టర్, ఎస్పీని కలిసిన కొమ్మాలపాటి

నరసరావుపేట, మహానాడు: పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతూ అభివృద్ధి, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును కోరారు. నరసరావుపేటలోని జిల్లా పరిపాలన కార్యాలయంలో కలెక్టర్ అరుణ్ బాబును కొమ్మాలపాటి గురువారం మర్యాద పూర్వకంగా కలిసి అభినందించారు.  అనంతరం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ ను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. పల్నాడులో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఎస్పీని కోరారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై ఎస్పీతో చర్చించారు.