వినుకొండ, మహానాడు : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా జయంతి వేడుకలను వినుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, టీడీపీ నాయకులు పాల్గొని కొనిజేటి రోశయ్య, వంగవీటి మోహనరంగా చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మార్కాపురం రోడ్డులోని వంగవీటి మోహన రంగా విగ్రహానికి, నరసరావుపేట రోడ్డులోని కొణిజేటి రోశయ్య విగ్రహానికి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి స్ఫూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు.