సాయం కోసం కొత్తూరు తాడేపల్లి వాసుల ఎదురుచూపులు

విజయవాడ: రూరల్ కొత్తూరు తాడేపల్లి లో వరద బాధితులు, బుడమేరు వరదతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. St. బెనెడిక్ట్ స్కూల్లో కొత్తూరు టీడీపీ నాయకులు వారం రోజులుగా ఆహారం అందిస్తున్నారు. వారి వద్ద నిల్వలు లేవని ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వాహనాలు, ట్రాక్టర్లు తమ వద్ద ఉన్నాయని, రెవిన్యూ అధికారులు ఇంత వరకు గ్రామాలకు రాలేదని చెబుతున్నారు.