కృష్ణా జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి 

– ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ 

మచిలీపట్నం, మహానాడు:  కృష్ణా జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాల్సిన ఆవశ్యకత ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. శనివారం మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశంలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ గతంలోనూ కృష్ణాజిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా ఉండేదన్నారు. సమష్టి కృషితో జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుదామన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కృష్ణా జిల్లాను అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రధానంగా సాగునీటి రంగాన్ని పటిష్టపరచుకుందామని పిలుపునిచ్చారు.