హైదరాబాద్, మహానాడు: అచ్చంపేట ఘటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదేనా మీ ‘‘ప్రేమ దుకాణం’’ రాహుల్‌గాంధీ? ప్రత్యర్థులపై నిర్మొహమాటంగా దాడి చేయడం, అధికార, పోలీసు దుర్వినియోగం చేయడం, దాడిలో భాగం కావడం సిగ్గుచేటు. తెలంగాణ డీజీపీ ఈ గూండాలపై కేసు బుక్ చేయకపోతే మేము మానవహక్కుల కమిషన్‌ను ఫిర్యాదు చేసి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.