ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో కర్నూలు జిల్లా టాప్

– వరుసగా రెండు నెలలు పెన్షన్ల పంపిణీలో అగ్రస్థానంలో కర్నూలు జిల్లా

కర్నూలు: సెప్టెంబర్ మాసంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ లో 99.47 శాతంతో కర్నూలు జిల్లా రాష్ట్రంలో అగ్రస్థానం లో నిలిచింది.కర్నూలు జిల్లాలో మొత్తం 2 లక్షల 42 వేల 583 పెన్షన్ లు ఉండగా అందులో 2 లక్షల 41 వేల 293 పెన్షన్ లను పంపిణీ చేసి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది.

గత ఆగస్టు మాసంలో కూడా పెన్షన్ల పంపిణీలో 98.03 శాతం తో జిల్లా రాష్ట్రంలో టాప్ లో నిలిచింది.. వరుసగా రెండు నెలలూ పెన్షన్ల పంపిణీలో జిల్లా అగ్రస్థానంలో నిలవడం విశేషం. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డెత్ కేసులు తీసివేయడం, 50 మందికి ఒక పెన్షన్ పంపిణీ అధికారిని నియమించుకోవడం, పెన్షన్ దారులకు ముందుగా సమాచారం అందించడం వంటి ప్రణాళికా బద్ధమైన చర్యల వల్ల పెన్షన్ల పంపిణీలో జిల్లా అగ్రస్థానంలో నిలుస్తోంది.