తవ్వకాలకు అనుమతి లేదన్న మైనింగ్ డీడీ
అక్రమార్కులకు కొమ్ముకాసిన కంచకచర్ల పోలీసులు
ఇసుక మాఫియాపై ఏం సమాధానం చెబుతారు?
కోర్టును ఆశ్రయిస్తామంటున్న గ్రామాల ప్రజలు
కంచికచర్ల, మహానాడు : ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలంలోని చెవిటికల్లు, గని ఆత్కూరు, మున్న లూరు గ్రామాల గుండా ప్రవహించే కృష్ణానది నుంచి అక్రమంగా లక్షల టన్నుల ఇసుకను తరలించి ఇసుక అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. ఇసుకను తవ్వడా నికి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని తేల్చి చెప్పిన మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఒక పక్క చెబుతున్నా ఇసుక మాఫియాతో పోలీసులు చేతులు కలిపి స్థానిక గ్రామాల ప్రజలను బెదిరిస్తూ లక్షల టన్నుల ఇసుకను బహి రంగంగానే తరలిస్తున్నారు. ఈ తంతు తెలిసే జరుగుతున్నా కంచకచర్ల పోలీ సులు నోరుమెదపరు. ఎటువంటి చర్యలు తీసుకోరు. అక్రమార్కులకు కొమ్ము కాసిన కంచికచర్ల పోలీసులు ప్రజలకు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నిస్తు న్నారు. న్యాయస్థానాన్ని, ఎలక్షన్ కమిషనర్‌ను ఆశ్రయించేందుకు సిద్ధమవు తున్నారు.