– మెట్రో విస్తరణకు ముందడుగు
హైదరాబాద్ : పాత బస్తిలో మెట్రో విస్తరణలో భాగంగా భూ సేకరణకు హైదరాబాద్ మెట్రో రైల్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా ఎంజీబీఎస్ నుంచి చంద్రయణ గుట్ట దాకా 7.5 కిలో మీటర్ల మేర భూ సేకరణకు పనులు ప్రారంభించింది. రోడ్ల విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి వీలుగా భూ సేకరణ ప్రారంభించినట్టు మెట్రో ఎండి ఎన్.వి.ఎస్ రెడ్డి తెలిపారు.