లాయర్ల కష్టానికి త్వరలోనే ఫలితం

అధికారంలోకి రాగానే ల్యాండ్‌ టైట్లింగ్‌ రద్దు
టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌

విజయవాడ : జగన్‌ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌కు వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన పెరిగిందని, త్వరలోనే ఫలితం రాబోతుందని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్‌ (చిన్ని) అన్నారు. గవర్నర్‌ పేట సివిల్‌ కోర్ట్‌ కాంపౌండ్‌లోని బెజవాడ బార్‌ అసోసియేషన్‌ హాలులో సభ్యులతో గురువారం ఆత్మీయ సమావేశంలో కేశినేని శివనాథ్‌, గద్దె రామ్మోహ న్‌, బొండా ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌కు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ కొత్త చంద్రమౌళి, జనరల్‌ సెక్రటరీ అరిగల శివరామప్రసాద్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ గుండూరి వెంకటరామశర్మ, జాయింట్‌ సెక్రటరీ కలతోటి క్రాంతికుమార్‌, లేడీ సెక్రటరీ సిద్దబత్తిని రాజ్యలక్ష్మీ, ఎన్టీఆర్‌ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, గెడ్డం రాజేశ్వరరావు, ఎనుబోతు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.