నారా లోకేష్ సమక్షంలో టీడీపీలోకి భారీగా చేరికలు
ప్రజా ప్రభుత్వ స్థాపనకు కలిసి రావాలన్నా నారా లోకేష్ పిలుపునకు విశేష స్పందన లభిస్తోంది. చంద్రగిరి, తిరుపతి, చిత్తూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైసీపీ ప్రముఖులు తొండవాడ జీబీఎస్ కల్యాణ మండపంలోని యువగళం క్యాంపులో లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల సర్పంచ్ బుట్టా మధునాయుడుతో పాటు 100 మంది అనుచరులు, చినకూరపాడుకు చెందిన గుంటూరు గజేంద్రనాయుడు, వంశీతో సహా 100 మంది అనుచరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
వీరితో పాటు చిత్తూరు కార్పొరేషన్ వైసీపీ కోఆర్డినేటర్ ఎల్ బీఐ లోకేష్ రెడ్డి సహా 25 మంది, గుడిపాల మండల ఎంపీటీసీ జి.హరిప్రసాద్ చౌదరితో సహా ఐదుగురు, తిరుపతి నియోజకవర్గానికి చెందిన డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఆల్ ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి రఫీ హిందూస్థానీ సహా 30 మంది ముస్లీం మతపెద్దలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ యువనేత పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. మరో పది రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో విధ్వంస పాలనకు ముగింపు పడుతుంది. పార్టీలో చేరిన వారు తెలుగుదేశం భారీ విజయానికి కృషి చేయాలని కోరారు.