మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి ప్రముఖుల నివాళులు

నెల్లూరు, మహానాడు: నెల్లూరులోని మాగుంట స్వగృహంలో దివంగత మాగుంట పార్వతమ్మ భౌతిక కాయానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి, డాక్టర్‌ కడియాల లలిత్ సాగర్, మార్కాపురం శాసన సభ్యుడు కందుల నారాయణ రెడ్డి, సంతనూతలపాడు శాసన సభ్యుడు బీఎన్‌ విజయకుమార్, కనిగిరి శాసన సభ్యుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యుడు పనబాక లక్ష్మి, తదితర నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ లక్ష్మి మాట్లాడుతూ మాగుంట పార్వతమ్మ ప్రకాశం జిల్లాలో విశేష సేవలందించారని కొనియాడారు.