ఎన్నికల ప్రధానాధికారికి ఏపీ జేఏసీ వినతి
అమరావతి, మహానాడు : ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు మే 12 నుంచి 13వ తేదీ పోలింగ్ రోజు రాత్రి వరకు పనిచేయాల్సి ఉంటుందని, కొన్ని చోట్ల మరుసటి రోజు తెల్లవారుజాము వరకు పనిచేస్తారని అందువల్ల పోలింగ్ తర్వాత రోజు స్పెషల్ క్యాజువల్ లీవ్ మంజూరు చేయా లని ఏపీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు శనివారం వెలగపూడి సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్ మీనాను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం 14న ప్రత్యేక సెలవు దినంగా ప్రకటించిందని తెలిపారు. సీఈవో ను కలిసిన వారిలో అమరావతి జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోసియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళి కృష్టనాయుడు ఉన్నారు.