రాష్ట్ర అభివృద్ధి కోసం ఆరు రొట్టెలను వదలండి

– సీఎం నారా చంద్రబాబు నాయుడు

నెల్లూరు : నెల్లూరులో రొట్టెల పండుగ అంగ రంగ వైభవంగా జరుగుతుంది. దీనికీ జనాలు పెద్ద ఎత్తున హాజరు అవుతున్నారు. దీనికి సుమారు 20 లక్షల మంది హాజరు అవుతారని అంచనా.  ఈ రొట్టెల పండుగను రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఈ రొట్టెల పండుగ వద్ద భక్తులతో వీడియో కాన్ఫరెన్స్ ధరసీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు నారాయణ, ఆనం, వేంరెడ్డి, ప్రసంతి రెడ్డి, కోటం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.రొట్టెల పండుగ నిర్వహణకు 5 కోట్లు నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్. ఈ రొట్టెల పండుగకు అంతర్జాతీయ గుర్తింపు తెస్తానని సీఎం నారా చంద్రబాబునాయుడు తెలిపారు.