Mahanaadu-Logo-PNG-Large

జర్నలిస్ట్ సాయి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

– మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి

విజయవాడ : ఒక మతంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తను జర్నలిస్ట్ సాయి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం చేసినందుకు ఆయనపై చర్య తీసుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ఫారూఖ్ షుబ్లి ఆమేరకు ఆయన సాయిపై ఫిర్యాదు చేశారు.

సాయి తీరు సంఘవిద్రోహక చర్య క్రిందకి వస్తుందని, ఇలాంటి తప్పుడు వార్తలు మతసామరస్యానికి భంగంకలిగిస్తాయని సంఘవిద్రోహక శక్తులకు ఊతమిస్తాయని, సోదర భావంతో మెలుగుతున్నవారి మధ్యలో పొరపచ్చలు వస్తాయని ఇలాంటి వాటిని వెంటనే నిర్మూలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. దీనిపై కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.హెచ్.డి రామకృష్ణ తగు చర్యలు తీసుకుంటామని అన్నారు.