సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి, మహానాడు : ముప్పాళ్ల మండలం తురకపాలెం, దమ్మాలపాడు గ్రామాలలో సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కన్నా మాట్లాడుతూ ఒక రాజధాని నిర్మించే సత్తా లేనోడు మూడు రాజధానులు కడతా అని చివరికి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడని విమర్శించారు. మన రాజధాని, మన భవిష్యత్ మనమే నిర్మించుకుందామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రాగానే 20 లక్షలు ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడమే కూటమి లక్ష్యమన్నారు.
ఓటు వేసే ముందు యువత తమకు ఎలాంటి భవిష్యత్ కావాలో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. పేదలు ఎప్పుడూ.. పేదలుగానే ఉండాలని మనస్తత్వం జగన్ రెడ్డిదని, అందుకే తన కోసం ప్యాలెస్‌లు కట్టుకుని పేదల కోసం మాత్రం ఇరుకిళ్లు ఇస్తాడని అన్నారు. దీన్నే పెత్తందారీ పోకడ అంటారని, మే 13న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.