గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం

ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం
బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు.

– గ్రూప్ 2 అభ్యర్థులతో సచివాలయం లో సమావేశమైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
– నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ చివరివారానికి గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలించాలంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం

హైదరాబాద్: గ్రూప్ 2 పరీక్ష వాయిదా అంశాన్ని పరిశీలిస్తాం. డిసెంబర్ చివరి వారంలో నిర్వహణకు సాధ్యా సాధ్యులపై అధికారులతో చర్చిస్తాం.మూడు నెలల కాలంలోనే 54 వేల ఉద్యోగాలకు మోక్షం కల్పించాం. ఉద్యోగ ఖాళీలు వెతికి జాబ్ క్యాలెండర్ను ప్రకటిస్తాం, ఓవర్ లాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తాం.

రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం.గత ప్రభుత్వం మొదటి పది సంవత్సరాల్లో ఉద్యోగాలు భర్తీ చేసి ఉంటే లక్షలాది కుటుంబాలు స్థిరపడేవి. సీఎల్పీ నేతగా నేను, పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు నిరుద్యోగులు లేవనెత్తిన అంశాలనే మా పార్టీ ఎన్నికల ఎజెండాగా చేసుకున్నాం.

సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.. తెలంగాణ బిడ్డలకు ఎంత తొందరగా ఉద్యోగాలు ఇస్తే అంత మంచిది.. ఎన్నికల్లో హామీ ఇచ్చాం మనస్సాక్షికి సమాధానం చెప్పాలన్నారు.ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం చేస్తే ప్రభుత్వానికే జీతాల భారం తగ్గుతుంది.. కానీ మేము అలా ఆలోచించడం లేదు.

మా బిడ్డలు స్థిరపడాలి వారి కుటుంబాలు ఆర్థికంగా ఎదగాలని మనసారా కోరుకుంటున్నాం.విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాలని వడివడిగా అడుగులు వేస్తున్నాం. బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి.. కేసుల పాలైతే మీరే నష్టపోతారు.. కొందరు వారి లాభాల కోసం చేసే ప్రయత్నాల్లో మీరు ఇబ్బందులు పడవద్దు.

కొద్ది రోజుల్లోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభించబోతున్నాం.అధునాతన టెక్నాలజీతో వీటిని నిర్మిస్తున్నాం.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోటీ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్లో శిక్షణ ఇస్తాం.

పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు దేశంలోనే ఉన్నతమైన సబ్జెక్టు నిపుణులను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ లో పాఠాలు బోధిస్తారు.. ప్రిపేర్ అయ్యేవారు ఆయా కేంద్రాల నుంచి ఆన్లైన్లోనే ప్రశ్నలు వేయవచ్చు… అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు ఇకనుంచి అశోక్ నగర్ లో ఐదు రూపాయల భోజనంతో ఇబ్బంది పడాల్సిన పనిలేదు.

నిరుద్యోగులు చెప్పిన ప్రతి అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తాం, మీరు మా బిడ్డలు.. రాష్ట్ర సంపద.. మీ మేధస్సు నిలువు ఉపయోగం కావద్దనేదే ప్రభుత్వం ఆలోచన… ఇందిరమ్మ ప్రభుత్వం నూటికి నూరు శాతం మీ సమస్యలు వింటుంది పరిష్కరిస్తుంది. గ్రూప్ 2 అభ్యర్థులతో మాట్లాడి సమస్య పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.