అబ్దుల్ కలాం ఆశయాలను కొనసాగిద్దాం

ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు 

వినుకొండ, మహానాడు:   డాక్టర్ అబ్దుల్ కలాం ఆశయాలను యువత కొనసాగించాలని వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. పట్టణ కార్యాలయంలో డాక్టర్ అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు అబ్దుల్ కలాం చిత్రపటానికి పూలమాలలు  వేసి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ..  అబ్దుల్ కలాం దేశానికి ఎనలేని సేవ చేశారన్నారు.  ఆదర్శ రాష్ట్రపతిగా దేశానికి సేవలందించారు. పేదరిక నిర్మూలన జరగాలని గొప్ప ఆశయంతో ముందుకు నడిచిన అబ్దుల్ కలాంను ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నారు. సైంటిస్ట్ గా అపారమైన అనుభవం గడించారన్నారు. మాజీ ప్రధాని వాజ్ పెయి, అద్వానీ, ముఖ్య మంత్రి చంద్రబాబు కోరిక మేరకు ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఆమోదించారని అలాంటి గొప్ప వ్యక్తి కలాం  అని అన్నారు. అబ్దుల్ కలాం ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

శనివారం అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పఠాన్ అయిబ్ ఖాన్, టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ జానీ, బీసీ నాయకులు గుంజి కాలింగ రాజు, గంగినేని ఆంజనేయులు కుంట కోటిరెడ్డి, ఈశ్వరయ్య, గుంజర పున్నయ్య, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు