Mahanaadu-Logo-PNG-Large

జగనాసురుడిని ఓటుతో అంతమొందిద్దాం

సంహారానికి మే 13న ముహూర్తం ఖరారు
అన్ని వర్గాల ప్రజలు కలిసిరావాలి
బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపు

అమరావతి: జగనాసురుడి పాలనను ఓటుతో అంతమొందిద్దామని బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం పిలుపునిచ్చారు. బ్రాహ్మణ చైతన్య వేదిక, అర్చక సేవా సంఘం సంయు క్తంగా బ్రాడీపేట 4/9 రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమా వేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ, అర్చక సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంధ్యాల రామలింగేశ్వర శాస్త్రి పాల్గొని మాట్లాడారు. త్రేతాయుగంలో వివిధ రూపాల్లో దేవళ్లు అవతారాలు ఎత్తి రాక్షసులను సంహరించే వారని, అలానే ఈ కలియు గంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జగన్‌ అనే రాక్షస మనస్తత్వం ఉన్న వ్యక్తి క్రూర రాక్షస పరిపాలన కొనసాగించాడని అని వర్గాల వారు నష్టపోయారన్నారు. ఆ త్రిమూ ర్తులు ఎన్నికల రూపంలో ప్రజల చేతిలో ఈ రాక్షసుడిని అంతమొందించేందుకు ఈనెల 13 తేదీన ముహూర్తం ఖరారు చేశారని, అందువల్ల ఓటు అనే ఆయుధంతో ఈ జగనాసురు డిని అంతమొందించాలని పిలుపునిచ్చారు. ఈ జగనాసురుడి పాలనలో మా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారన్నారు.

ఆలయాలపైన దాడులు జరిగాయన్నా రు. వంశపారంపర్య అర్చకులకు సుప్రీంకోర్టు గైడ్‌ లైన్స్‌ ప్రకారం విధివిధానాలు రూపకల్పన చేస్తానని చెప్పి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 50 వేల దేవాలయాల అర్చకులను, వారి కుటుంబసభ్యులను మోసం చేసిందని, ఈ ఉసురు తప్పకుండా జగనాసురుడికి తగిలి తీరుతుందని శపించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘం నాయకులు కొప్పర్తి సీతారమేష్‌, బొడ్డుపల్లి శ్రీనివాసు, నల్గొండ రాధాకృష్ణమూర్తి బందా శశిధర్‌, వేదాంతం శ్రీనివాస్‌, ప్రతాప ప్రసాద్‌, లంకా రవి, ఐలూరి శ్రీనివాస్‌, వడ్డమాను ప్రసాద్‌, చిలుమూరు ఫణి ఐలూరి నాని తదితరులు పాల్గొన్నారు.