– ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట రాజేష్
అమరావతి, మహానాడు: రాష్ట్ర ప్రజలకు ఎంతో మేలు చేయనున్న త్వరలో జరుగబోయే రెవెన్యూ సదస్సులను విజయవంతం చేద్దాం…రెవెన్యూ శాఖకు పట్టుకొమ్మగా ఉన్న గ్రామ స్థాయి వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేయడానికి రెవెన్యూ సదస్సులు బాగా ఉపకరిస్తాయని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గా ఎన్నికైన రామిశెట్టి వెంకట రాజేష్ అన్నారు. రెవెన్యూ కార్యాలయాలలో ఉద్యోగులు పనిచేసే వాతావరనాన్ని ప్రభుత్వం కల్పించాలని ఆయన కోరారు. ఏలూరులోని రెవిన్యూ భవనంలో ఆంధ్రప్రదేశ్ రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం జరిగింది. ఈ సమావేశానికి అందరూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, 26 జిల్లాల అధ్యక్ష / కార్యదర్శులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా రెవిన్యూ శాఖ ఎదుర్కొంటున్న ఇబ్బందులు వాటి పరిష్కారరాల విషయమై సుదీర్ఘమైన చర్చలు జరిపిన అనంతరం పలు తీర్మానాలు ఏకగ్రీవంగా ఆమోదించారు.