– మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి
అనంతపురం : తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం సభను విజయవంతం చేద్దామని అనంతపురం మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఆదివారం అనంతపురం అర్బన్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ మార్గాల్లో ప్రజా చైతన్యం కలిగించడానికి పార్టీకి పూర్వ వైభవం తేవాలని నారా లోకేష్ గతంలో పాదయాత్ర చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తున్నారని, అనంతపురం నియోజకవర్గంలో సోమవారం రుద్రంపేట బైపాస్ లో పీవీకే కళాశాల లో శంఖారావం సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.