బీజేపీకి రాజకీయ సమాధి కడతాం
రేవంత్‌రెడ్డి ప్రజాపాలనపై కుట్రలు మానుకోవాలి
పదేళ్లు తెలంగాణకు ఏం చేశారని ఓట్లడుగుతారు
మోదీ కోసమే కేసీఆర్ యాత్రలు..ఇద్దరూ చీకటి దొంగలు
టీపీసీసీ అధికారి ప్రతినిధి చనగాని దయాకర్
హైదరాబాద్, మహానాడు : గాంధీభవన్‌లో సోమవారం టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కుట్రలు చేయాలని చూస్తే మోదీ, అమిత్ షాలను హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరిం చారు. పదేళ్లు తెలంగాణకు మోదీ ఏం చేశాడో చెప్పాలని నిలదీశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కోట్లాడి సాధించుకున్నాం. దొరలు, దోపిడీదారుల మీద పోరాటం చేసి ప్రజాపాలనను ఏర్పాటు చేసుకున్నాం. తెలం గాణలో మత ద్యేషాలకు తావులేదు. ప్రజా పాలనపై కుట్రలు చేస్తే బీజేపీకి రాజకీయ సమాధి కడుతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట ఏర్పాటును జీర్ణించుకోలేని మోదీకి తెలంగాణలో ఓట్లు అడిగే నైతికత ఉందా అని ప్రశ్నించారు.
పదేళ్లలో తెలంగాణకు ఐఐఎం, ఐఐటీ అయినా ఇచ్చావా అని ప్రశ్నించారు. ఒక్క ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇచ్చావా? అని నిలదీశారు. బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు రాజకీ య చీకటి దొంగలని మండిపడ్డారు. బీజేపీకి సీట్ల కోసం కేసీఆర్ యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. కేసీఆర్, మోదీ మధ్య అధికార, పైసల పొత్తు ఉంది. వేముల రోహిత్ ఆత్మహత్యకు బీజేపీ నాయకులు కారణం కాదా? బాధ్యులను శిక్షించే వరకు కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి అండగా ఉంటుందని, సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. మానవ హక్కులకు, పౌర హక్కులను కాంగ్రెస్ పార్టీ కాపాడుకుంటుందని తెలిపారు. బీజేపీకి ఓటువేస్తే నల్లమల్ల అడవి ఆగమవుతదని హెచ్చరించారు. తెలంగాణలోని అభ్యుదయ, లౌకికవాదు లు, బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను ఛేదించాలని పిలుపునిచ్చారు.