Mahanaadu-Logo-PNG-Large

రేవంత్‌ను తీసుకెళతామంటే చూస్తూ ఊరుకోం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

మధిర, మహానాడు : మధిర నియోజకవర్గం చింతకాని మండల కేంద్రంలో సోమవారం కార్నర్‌ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రసంగించారు. బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. గత పాలకుల మాదిరిగా రాష్ట్ర సంపదలను దోచుకోవడం లేదు. వారు దోచిన సొమ్మును అమెరికా, సింగపూర్‌లో పెట్టారని విమర్శించారు. మేం తెచ్చిన తెలంగాణలో ప్రజల జీవితాల్లో మార్పు కోసం చేస్తున్న కృషిని చూడలేక పెద్దమనిషి బూతులు మాట్లాడుతుంటే మాకే సిగ్గేస్తుందన్నారు. రిజర్వేషన్లపై మాట్లాడితే కేసులు కట్టి సీఎం రేవంత్‌రెడ్డిని ఢల్లీికి తీసు కుపోతామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ప్రతి నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్‌ నాలెడ్జ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.