– ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా మాధవి
గుంటూరు, మహానాడు: గాంధీ చూపిన అహింస, శాంతి సమాజం కోసం కృషి చేద్దామని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపునిచ్చారు. బుధవారం గాంధీ జయంతి పురస్కరించుకొని గుంటూరులోని పట్టాభిపురం మెయిన్ రోడ్డు, హిమనీ సెంటర్ లలో మహాత్మా గాంధీ విగ్రహాలకు ఎమ్మెల్యే పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… గాంధీ బాటలో అందరూ నడవాల్సిన ఆవశ్యకత ఉందని, సత్యం, అహింసకు మించిన ఆయుధాలు లేవంటూ ప్రపంచ శాంతికి బాపూజీ మార్గ నిర్దేశం చేశారని తెలిపారు. సింహాద్రి కనక చారి, కోవెలమూడి రవీంద్ర, ఈరంటి వర ప్రసాద్, కసుకుర్తి హనుమంతరావు, మానుకొండా శివ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.