– జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి
రాజోలు, మహానాడు: అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గం లో తెలుగుదేశం పార్టీ నుండి మన టిడిపి యాప్ ద్వారా పార్టీ కార్యక్రమాలను వివిధ సోషల్ మీడియా యాప్ లలో గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లిన ప్రతినిధులు చాగంటి స్వామి, కడలి రమేష్, కుంచె గంగాజలం, బోళ్ల రాజేష్, బందెల పద్మ, జిల్లెల్ల బాబూ ప్రసాద్, పమ్మి దుర్గాప్రసాద్, దేవళ్ళ ఉదయ్ శ్రీనివాస్, అరుమిల్లి వెంకటకృష్ణ చౌదరి లకు చంద్రబాబు నాయుడు, లోకేష్ అభినందిస్తూ ప్రశంసా పత్రాలు పంపారు. వీటిని ఆదివారం కొత్తపేటలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంత కుమారి, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా వారి స్వగృహం వారికి అందజేశారు. ఈ కార్యక్రమం లో కేతా శ్రీనివాస్, గుబ్బల శ్రీనివాస్, అడబాల యుగంధర్, ముప్పర్తి నాని, తాడి సత్యనారాయణ, చిట్టూరి సంతోష్, బందెల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.