– బాధితులకు ఇప్పించిన మడకశిర ఎమ్మెల్యే
– ఎంఎస్ రాజుకి కృతజ్ఞతలు తెలిపిన గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్
మడకశిర, మహానాడు: వైసీపీ నేతల కబ్జా కోరల నుంచి భూములు విముక్తి పొందాయి. ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చొరవతో న్యాయం గెలిచింది. వైసీపీ ప్రభుత్వంలో మా భూములు కబ్జాకు గురయ్యాయని పట్టణ పరిధిలోని చీపులేటిలో గంగమ్మ, లక్ష్మీదేవి, గణేష్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో ఆయన తక్షణమే స్పందించారు. రెవెన్యూ అధికారులను పిలిచి, విచారించారు. బాధితులకు స్థలాలు వారికే చెందే విధంగా పట్టాలు తయారు చేయించారు. బాధితులకు ఎమ్మెల్యే పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు తీసుకున్న బాధితులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.