ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం కొంగ వారి గూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్ర కాలువ జలాశయానికి భారీగా వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి వరద నీరు రావడంతో శుక్రవారం అధికారులు 4 గేట్లు ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో నల్లజర్ల, తాడేపల్లిగూడెం,మండలాల్లో పంట పొలాలు నీట మునిగాయి.