రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు

విజయవాడ :  బెంగుళూరు రేవ్‌ పార్టీతో విజయవాడకు లింకులు ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసుది విజయవాడ కాగా క్రికెట్‌ బెట్టింగ్‌లో ఆరితేరాడని చెబుతున్నారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాలతో సంబంధం ఉందని అంటున్నారు. క్రికెట్‌ బుకీ వ్యవస్థ నడిపిస్తూ ఇటీవల వాసు గ్యాంగ్‌ ఖరీదైన స్థలాలు కొన్నట్లు సమాచారం. బెంగుళూరులో రేవ్‌ పార్టీకి వాసు అండ్‌ టీమ్‌ కూడా పనిచేసినట్లు గుర్తించారు.