హైదరాబాద్ లో రెండు రోజులు మద్యం షాపులు బంద్

హైదరాబాద్, మహానాడు:  బోనాల పండుగను వైభవంగా జరుపుతున్న నేపథ్యంలో ఎలాంటి అల్లర్లు, అవకతవకలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మద్యం దుకాణాలు మూసి వేయాలని అధికారులు నిర్ణయించారు. మహంకాళీ బోనాల పండుగను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ అంతటా నాన్ ప్రొప్రయిటరీ క్లబ్లు, స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లతో సహా అన్ని వైన్స్ షాపులు మూసి వేయనున్నట్లు సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి చెప్పారు. దీంతో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రెండు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి.