ముగిసిన లోకేష్‌ అమెరికా పర్యటన

– ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా సాగిన మంత్రి టూర్‌
– ఎయిర్ పోర్ట్ లో స్వాగతం పలికిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్

శంషాబాద్, మహానాడు: ఏపీలో పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన విజయవంతంగా సాగిందని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. వారం రోజుల అమెరికా పర్యటనను ముగించుకుని హైదారాబాద్ వచ్చిన మంత్రి లోకేష్ కు శంషాబాద్ విమానాశ్రయంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పులగుచ్చంతో స్వాగతం పలికారు.

పర్యటనలో భాగంగా ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈఓలతో భేటీ అయి ఏపీ పాలసీలు, నెలకొల్పిన ఎకో సిస్టమ్ వివరించి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి ఆహ్వానించారని తెలిపారు. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ విధ్వంసక విధానాల కారణంగా దారి తప్పిన పారిశ్రామిక రంగాన్ని గాడిన పెట్టేందుకు మంత్రి చేస్తున్న కృషి పెట్టుబడిదారుల్లో నూతనోత్సాహాన్ని నింపుతోందన్నారు.

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి వారం రోజులపాటు యువనేత లోకేష్ చేపట్టిన అమెరికా టుూర్ జైత్రయాత్రలా సాగిందన్నారు. వారం రోజుల యాత్రలో మంత్రి లోకేష్ ఏ దిగ్గజ కంపెనీ వద్దకు వెళ్ళినా రెడ్ కార్పెట్ స్వాగతం లభించిందన్నారు. పెట్టుబడులపై లోకేష్ ప్రతిపాదనలు పరిశ్రమలను ఆకర్షించే విధంగా ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అయిదేళ్ళ పాటు అరాచక పాలనలో శిథిలావస్థకు చేరిన పారిశ్రామిక రంగానికి రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆశాకిరణంలా మారారన్నారు. మంత్రి లోకేష్ కృషితో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చి యువతకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.