బుడమేరు గట్ల పటిష్ఠతపై లోకేష్ పర్యవేక్షణ!

* మంత్రికి పలువురు విరాళాల అందజేత

విజయవాడ, మహానాడు: బుడమేరు గట్ల పటిష్ఠతపై డ్రోన్ లైవ్ ద్వారా మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. భారీ వర్షం కురుస్తున్నా క్షేత్ర స్థాయిలో మంత్రి నిమ్మల రామానాయుడు ఉండి పనులు చేయిస్తున్నారు. ఇదిలావుండగా, వరద బాధితులను ఆదుకునేందుకు భారీగా దాతలు స్పందిస్తున్నారు. మంత్రి లోకేష్ ను కలిసి చెక్కులు అందజేశారు. ప్రముఖ పారిశ్రామికవేత్త గుత్తా బాలాజీ రూ. 15 లక్షలు, విజయవాడకు చెందిన పారిశ్రామిక వేత్త మైనేని శ్రీనివాస్ రూ. 10 లక్షలు, నిమ్మకూరుకు చెందిన వజ్ర ట్రాన్స్ పవర్ అధినేత డాక్టర్ యోనిత్య, అశ్వంత్ రూ. 5 లక్షలు విరాళం ఇచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకు మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.