మయన్మార్ విద్యార్థి మృతికి లోకేష్‌ సంతాపం

అమరావతి, మహానాడు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ బుద్ధిస్ట్ స్టడీస్ చదువుతున్న మయన్మార్ విద్యార్థి కొండన్న పాముకాటుకు గురై మృతి చెందటం బాధించిందని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా యూనివర్సిటీ అధికారులు తగిన భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కొండన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు.