అమరావతి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) సీనియర్ నేత, మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మృతి పట్ల విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఐదుసార్లు ప్రజాప్రతినిధిగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు చిరస్మరణీయ సేవలు అందించారని, నిరాడంబర ప్రజా సేవకుడిని పార్టీ కోల్పోయింది… వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.