కొత్త ఆశలు రేకెత్తించిన లోకేష్‌ అమెరికా టూర్‌

– జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ

గుంటూరు, మహానాడు: పెట్టుబడులు రప్పించేందుకు తద్వారా ఉద్యోగాల కల్పనకు అమెరికా పర్యటన చేసిన మంత్రి లోకేష్‌ జన్మభూమి రుణం తీర్చుకున్నారని జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయి కృష్ణ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని ఫార్చ్యూన్ 500 కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించి తిరిగి జన్మభూమికి విచ్చేసిన లోకేష్ ని గన్నవరం విమానాశ్రయంలో రావిపాటి మర్యాదపూర్వకంగా కలిసి ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున పరిశ్రమలు రప్పించేందుకు ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటన సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. వివిధ కంపెనీల సీఈవోలు, ప్రతినిధులతో భేటీ అయి సీఎం చంద్రబాబు విజన్, ఏపీ పాలసీలు, అనుకూలతలు వివరించి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించటంతో ఏపీ యువతలో కొత్త ఆశలు రేకెత్తించాయని సంతోషం వ్యక్తం చేశారు.