శ్రీకృష్ణుని కృప రాష్ట్రంపై ఉండాలి

– టీడీపీ ‘దర్శి’ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాలి లక్ష్మి

దర్శి, మహానాడు: శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు…. ఆ శ్రీకృష్ణ భగవానుడు అందరినీ ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను… గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తుచేసుకుని ముందుకు సాగడమేనని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాలి లక్ష్మి అన్నారు. దర్శిలో సోమవారం అత్యంత ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్ధం చేసుకుంటే ప్రతి అంశంలో విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్‌ నూకసాని బాలాజీ, మాజీ శాసనసభ్యుడు నారపుశెట్టి పాపారావు, టీడీపీ దర్శి నియోజకవర్గ యువ నాయకుడు డాక్టర్‌ కడియాల లలిత్ సాగర్, జబర్దస్త్ యాక్టర్ నేమిలి రాజు, తదితరులు పాల్గొన్నారు. వేడుకల అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.