నేడు బీజేపీ ప్రచారానికి మధ్యప్రదేశ్‌ సీఎం రాక

హైదరాబాద్‌, మహానాడు : వరంగల్‌- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి శుక్రవారం నాయకుల పర్యటన వివరాలను బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమారి బంగారు శృతి వెల్లడిరచారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ సాయంత్రం 6 గంటలకు వరంగల్‌లో ఓరుగల్లు సిటిజన్‌ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొంటారు. వర్ధన్నపేట నియోజకవర్గం లో సాయంత్రం నాలుగు గంటలకు మడికొండలోని పీఎన్‌ఎన్‌ ఫంక్షన్‌ హాలులో జరిగే గ్రాడ్యుయేట్‌ సదస్సులో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పాల్గొంటారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ నల్గొండలో 12 గంటలకు విలేఖరుల సమావేశం, అనంతరం కోదాడలో సాయంత్రం 6 గంట లకు కాశీ విశ్వనాథ ఫంక్షన్‌ హాలులో గ్రాడ్యుయేట్‌ సదస్సులో పాల్గొంటారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ వరంగల్‌ తూర్పు నియోజక వర్గంలో మధ్యాహ్నం 12 గంటలకు సదస్సులో పాల్గొంటారు.