చంద్రబాబును కలిసిన మహానాడు మీడియా టీమ్

అమరావతి, మహానాడు: వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకటసుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుతో కలిసి మర్యాపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా నాలుగు నెలల ఎన్డీయే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.