ఉండవల్లి, మహానాడు: ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ ను బుధవారం మహానాడు మీడియా అధినేత బోడేపూడి వెంకటసుబ్బారావు, చీఫ్ ఎడిటర్ మార్తి సుబ్రహ్మణ్యం, కో ఆర్డినేటర్ వాసిరెడ్డి రవిచంద్ర, గోరంట్ల సాంబశివరావు, గోనుగుంట్ల హనుమంతరావులు మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగు నెలల కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న సంతృప్తి, ప్రభుత్వ విధానాలు, రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.