విశాఖపట్నం, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు మనసున్న మహారాజులు ముందుకొచ్చారు. విశాఖ నోవాటెల్ హోటల్ లో బుధవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేశారు. విశాఖకు చెందిన పీఎస్ మస్తాన్ రావు (హిందూస్థాన్ ఎంటర్ ప్రైజెస్) రూ.10 లక్షల విరాళం అందజేశారు.
హైదరాబాద్ కు చెందిన సురేష్ (శ్రీనివాస ఫామ్స్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.10 లక్షలు, విశాఖకు చెందిన ఎన్.రవి కిషోర్ (అమ్ జుర్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్) రూ.3 లక్షలు, విశాఖకు చెందిన ఈ.శ్రీహరి రావు (క్వాంట్ సిస్టమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్) రూ.2 లక్షలు, విశాఖకు చెందిన వెంచర్ ఆఫ్ షోర్ ఇన్ఫోమాట్రిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వాహకులు రూ.లక్ష అందజేశారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు తమవంతు సాయం అందజేసిన దాతలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.