-34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు
-ఉదయం 8 గంటలకు ప్రారంభం
-5న నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్
-తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్
హైదరాబాద్: మహబూబ్‌నగర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ శనివారం జరగనున్న నేపథ్యం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మహబూబ్ నగర్‌లోని 34 ప్రాంతాలలో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయని, మూడంచె ల భద్రత కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ హాలు వద్ద 100 మీటర్ల వరకు అనుమతించరని, లోపలికి ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని వివరించారు. 2.80 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని, 276 టేబుళ్లు పోస్టల్ బ్యాలెట్ కోసం ఏర్పాటు చేశామని చెప్పారు. అత్యధికంగా 24 రౌండ్లు చొప్పదండి, యాకూత్ పుర, దేవరకొండలో ఉంటాయని వివరించారు. అత్యల్పంగా 13 రౌండ్లు ఆర్మూర్, భద్రా చలం, అశ్వారావుపేట్‌లో ఉంటాయని, మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 5 పోలింగ్ కేంద్రాల్లో వీవీ ప్యాట్‌ల లెక్కింపు ఉంటుందని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుం ది. పోస్టల్ బ్యాలెట్ ఉన్న చోట 8.30 నిమిషాలకు కౌంటింగ్ స్టార్ట్ అవుతుందని తెలిపారు.
5న నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్
జూన్ 5న నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఉంటుందని సీఈవో తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని 24 టేబుళ్లలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. రాజకీయ పార్టీ ఏజెంట్లకు బ్రీత్ అనలైజ్ టెస్ట్ అనేది లేదని తెలిపారు. రాజకీయ ర్యాలీలకు అనుమతి ఉండదని, పరిస్థితిని బట్టి అనుమతి ఇస్తారని చెప్పారు. కౌంటింగ్ రోజు మద్యం షాపులు మూసి ఉంటాయని వివరించారు.