– నామినేటెడ్ పదవులతో సామాన్య కార్యకర్తలకు పెద్దపీట
– కూటమి పార్టీల మధ్య సమతూకం
– బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు గుర్తింపు
– 11 మంది టీడీపీ క్లస్టర్ ఇన్‌ఛార్జీలు, 6 యూనిట్ ఇన్‌ఛార్జీలకు బాధ్యతలు
– చైర్మన్‌గా పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జి
– 20 కార్పొరేషన్లు కు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం
– ప్రకటించిన 99 పదవుల్లో యువతకు ప్రాధాన్యం
– పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు పదవులు
– అంకితభావానికి అందలం ఎక్కించిన సీఎం చంద్రబాబు
మంగళగిరి, మహానాడు: కేడరే లీడర్… అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మరోసారి నిరూపించింది. నామినేటెడ్ పదవుల పందేరంలో అంకితభావానికి అందలం ఎక్కించింది. సామాజిక న్యాయం పాటించింది. కూటమి పార్టీల మధ్య సమతూకం వేసింది. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసిన కార్యకర్తలు, నేతలకు నామినేటెడ్ పదవులు కట్టబెట్టిన సీఎం చంద్రబాబు తాను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఎప్పుడెప్పుడా అని అందరూ నిరీక్షిస్తున్న వేళ నామినేటెడ్ పదవుల ప్రకటన వచ్చేసింది. 11 మంది టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జులు, ఆరుగురు యూనిట్ ఇన్‌చార్జు లకు పదవులతోపాటు పార్టీ క్లస్టర్ ఇన్‌చార్జికి చైర్మన్ పదవి దక్కాయి. 20 కార్పొరేషన్లు కు చైర్మన్లు, ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్, వివిధ కార్పొరేషన్లు సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం… 99 పదవుల్లో యువతకు చోటు ఇచ్చింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం కల్పించారు
ఆర్టీసీ చైర్మన్‌గా కొనకళ్ల నారాయణ(బీసీ)
ఆర్టీసీ వైస్ చైర్మన్‌గా పి.ఎస్.మునిరత్నం(బీసీ)
వక్ఫ్ బోర్డు చైర్మన్‌గా అబ్దుల్ అజీజ్
శాప్ చైర్మన్‌గా రవినాయుడు(టిడిపి కార్యకర్త)
గృహ నిర్మాణ బోర్డు చైర్మన్‌గా తాత్యబాబు
ట్రైకార్ చైర్మన్‌గా బొరగం శ్రీనివాసులు (ఎస్సీ)
మారిటైమ్ బోర్డు చైర్మన్‌గా దామచర్ల సత్య
సీడాప్ చైర్మన్‌గా దీపక్ రెడ్డి
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్‌గా లంకా దినకర్(బీజేపీ)
ఏపీ మార్క్ ఫెడ్ చైర్మన్‌గా కర్రోతు బంగార్రాజు (తూర్పుకాపు బీసీ)
సీడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా మన్నె సుబ్బారెడ్డి
ఏపీఐఐసీ చైర్మన్‌గా మంతెన రామరాజు
పద్మశాలీ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నందం అబద్ధయ్య (పద్మశాలీ బీసీ)
ఏపీటీడీసీ చైర్మన్‌గా నూకసాని బాలాజీ (బీసీ యాదవ)
ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్‌గా పీలా గోవింద సత్యనారాయణ(బీసీ)
ఎంఎస్ఎంఈ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా తమ్మిరెడ్డి శివశంకర్
ఏపీటీపీసీ చైర్మన్‌గా వజ్జ బాబురావు (బీసీ కాళింగ)
ఏపీ టిడ్కో ఛైర్మన్ గా వేములపాటి అజయ్ కుమార్
పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్‌గా తోట సీతరామ సుధీర్
లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ చైర్మన్‌గా పిల్లి మాణిక్యరావు(ఎస్సీ)
ఏపీ వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్‌గా పీతల సుజాత (ఎస్సీ)