మానత్వాన్ని చూపిన మానవత సంస్థ

గుంటూరు, మహానాడు: నగరంలో రెండేళ్ళుగా బహుముఖ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న మానవత స్వచ్ఛంద సంస్థ బుడమేరు వరద బాధితుల సహయం కోసం రెండు లక్షల రూపాయల విలువగల దుప్పట్లు, నిత్యావసర సరుకులను విజయవాడలోని శాంతినగర్ లో గల 61 వ వార్డు లోని 300 కుటుంబాలకు అందించింది. ఈ సాయంపై మానవత ప్రధాన సలహదారుడు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం రెడ్డి లక్ష్మణరెడ్డి అభినందించారు.

స్థానిక మానవత కార్యాలయం నుండి బుధవారం ఉదయం దుప్పట్లు, నిత్యావసర సరుకుల తో కూడిన 300 బ్యాగ్ లతో ఉన్న వాహనాన్ని జెండా ఊపి మానవత చైర్మన్ పావులూరి రమేష్, అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీనివాసరావు, కార్యదర్శి కె. సతీష్ లు ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ ప్రసంగిస్తూ బుడమేరు వరద బాధితుల్లో అత్యధికంగా ఉన్న శాంతినగర్ 61 వ వార్డును ఎంపిక చేసుకున్నామని, అక్కడ స్పెషల్ ఆఫీసర్ గా ఉన్న మల్లవరపు సూర్య తేజ సహకారాన్ని తీసుకొని 300 కుటుంబాలను ఎంపిక చేసుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవత నేతలు బి. యన్. మిత్రా, టీ.వి. సాయిరాం, ఎ. బాలకృష్ణ చౌదరి, వర్రె సుబ్రహ్మణ్యం, శివాజీ, ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.