మన్మథ లీల.. వై‘కామ’ గోల!

వైనాట్.. వై‘కామ’పార్టీ?
వై‘కామ’గా మారుతున్న వైకాపా
వైసీపీలో పెరుగుతున్న జాతిరత్నాలు
కామాంధుల పార్టీగా మారుతుందంటూ మహిళా కార్యకర్తల కలవరం
విజయసాయి, అవంతి, అంబటి, మాధవ్, దువ్వాడ సరసన ఎమ్మెల్సీ అనంతబాబు
తన భార్య బిడ్డకు విజయసాయిరెడ్డే తండ్రంటూ రోడ్డెక్కిన శాంతి భర్త
విజయసాయి డీఎన్‌ఏకు శాంతి భర్త డిమాండ్
ఓ మహిళ వీడియో బెదిరింపుతో 2 కోట్లు సమర్పించుకున్న టీటీడీ మాజీ చైర్మన్
నాటి మహిళా మంత్రితో ‘సకల’క ళా వల్లభ లీలలు
వైసీపీ మహిళా నేతకు జిప్పు తీసి అంగప్రదర్శన చేసిన అనంతబాబు
తాజా వీడియో వైరల్‌తో తలపట్టుకున్న వైకాపా నేతలు
వైసీపీ మహిళా నేత హానీట్రాప్‌లో అనంతబాబు?
బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ మహిళా నేతకు అనంతబాబు ఆర్ధికసాయం
అప్పటినుంచీ కొనసాగుతున్న బంధం
హటాత్తుగా అనంతబాబు నగ్న ప్రదర్శన వీడియో వైరల్
బేరం కుదరక వైసీపీ మహిళానేతనే అది విడుదల చేశారా?
పాత వీడియోలతో జగన్‌ను ర్యాగింగ్ చేస్తున్న సోషల్‌మీడియా దళం
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ముందు జగనన్న ప్రతి సభలో వైనాట్ 175?.. వైనాట్ కుప్పం అని ప్రశ్నించేవారు. కానీ ఇప్పుడు అది రివర్సయి.. వైనాట్ వై‘కామ’పార్టీ? దిశగా సాగుతోంది. వైకాపా.. రాను రాను వై‘కామ’పార్టీగా మారుతోందా? కామాంధులకు కేరాఫ్ అడ్రస్‌గా వైకాపా మారుతోందా? పెరుగుతున్న ‘మహిళోద్ధారకుల’ సంఖ్య పార్టీ మహిళా శ్రేణులకు ఇబ్బందిగా మారుతోందా? కామాంధుల పార్టీగా ముద్రపడితే మహిళలకు ఎలా చూపించాలని వైకాపేయులు మల్లగుల్లాలు పడుతున్నారా? మాజీ ఎంపి గోరంట్ల మాధవ్‌ను ఆదర్శంగా తీసుకుంటున్న నేతల సంఖ్య పెరుగుతోందా? చివరాఖరకు వైకాపా పేరు తొలగించి.. వైకామ పార్టీ, లేదా వై‘కామంధుల’ పార్టీగా మార్చేసి.. కామాంధులందరికీ పదవుల పట్టాభిషేకం చేస్తారా?.. ఇదీ ఇప్పుడు రసికరాజులు, రసిక శిఖామణులు, మన్మథరాజులు, శృంగారశ్రేష్ఠులతో వై‘కామ’ పార్టీగా రూపాంతరం చెందుతున్న వైకాపాలో జరుగుతున్న ‘హాట్’ టాపిక్.

నా మన్మథరాజా
నీకై వేచెను రోజా
వడిలో చేర్చుకో రాజా
మన్మథరాజా.. మన్మథరాజా .. కన్నెమనసే గిల్లొద్దు
దోపిడీచేసే చూపులతోటి చుట్టుకొలతే చూడొద్దు
నా పచ్చి నరాలపై కచ్చి పెదాలతో కిచ్చు కిచ్చు ముద్దుపెట్టొద్దు
నా కొత్త వయసునే మత్తు సరస్సుగా చేసి ఈత కొట్టొద్దు మన్మథరాజా..
-‘దొంగ దొంగది’ సినిమాలోని ఈ పాట, ఇప్పుడు వైకాపా నేతల సెల్‌ఫోన్లకు రింగ్‌టోన్‌గా వినిపిస్తోందట. వైకాపాలోని రసికరాజులంతా ఆ పాటను మహా ఎంజాయ్ చేస్తున్నారట. అలా ఆ పాటనుంచి స్ఫూర్తిపొందుతున్న వారంతా, ఇప్పుడు ప్రాక్టికల్స్‌లో పడి తాము ఇరుక్కుపోయి, పార్టీని అడ్డంగా ఇరికించేస్తుంటే.. అసలు ఇలాంటి కామాంధుల పార్టీలో కొనసాగడం అవసరమా? అని మహిళా శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్నారట.

జగనన్న సారథ్యంలోని వైకాపాలో.. మహిళలను ఉద్ధరించే జాతిరత్నాలు తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్నారు. ఒకరిని మించి మరొక మహిళోద్ధారకులు తన్నుకుంటూ పైకొస్తున్నారు. ఒక విజయసాయిరెడ్డి, అవంతి శ్రీనివాస్, అంబటి.. మరో గోరంట్ల మాధవ్, దువ్వాడ శ్రీనివాస్.. ఇంకో టీటీడీ మాజీ చైర్మన్ పెద్దా‘రెడ్డి’.. అధికారంలో ఉన్నప్పుడు ‘సకల’ కళా వల్లభుడిగా పేరున్న ఓ రెడ్డిగారి ‘చిలకల’ చప్పుళ్లు, గుంటూరు జిల్లా వారికే కాదు. రాష్ట్రంలోని వైకాపేయులందరికీ ఎరుకేనట. ఇప్పుడు లేటయినా, లేటెస్టుగా ఎమ్మెల్సీ అనంతబాబు. వీరి శృంగారనైషధం చూడలేక పాపం వైకాపా మహిళా శ్రేణులు చచ్చిపోతుంటే.. ఇలాంటి తమ్ముళ్లకు అన్నయ్యనయినందుకు జగనన్న గర్వపడుతున్నారట.

తన ప్రియురాలికి సెల్‌ఫోన్ వీడియోలో అంగప్రదర్శన చేసిన గోర ంట్ల మాధవ్ యవ్వారం, సోషల్‌మీడియాలో లక్షల వ్యూస్‌కు చేరింది. ఆఫ్టరాల్ సీఐగా పనిచేసిన మాధవ్ అంగ ప్రదర్శనకే లక్షల వ్యూస్ వస్తే… ఎమ్మెల్సీని, అందునా ఒక దళితుడిని మర్డర్ చేసి అతగాడి ఇంటికే డెడ్‌బాడీ పార్శిల్ చేసిన తన అంగ ప్రదర్శనకు, ఇంకెన్ని కోట్ల వ్యూస్ రావాలన్న పట్టుదలే, అనంతబాబును ఇప్పుడు ‘ఈ స్థాయికి ఎదిగేలా’ చేసింది. అందుకే అనంతబాబు అంగప్రదర్శనకు కోట్లాది వ్యూస్‌లు వచ్చి, జగనన్న గర్వపడేలా చేసింది. నిజంగా అనంతబాబు వంటి ఆణిముత్యాలు ఎంతమందికి లభిస్తారు? అలాంటి జాతిరత్నమైన తమ్ముడు దొరకడం జగనన్న పూర్వజన్మ సుకృతమే కదా? జెరూసెలం వెళ్లకుండానే ఫ్రీగా లభిస్తున్న పుణ్యంతో తాడేపల్లి పుచ్చిపోయిందట.

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు విజయవాడలో ఒక వైసీపీ మహిళా నేతకు, ఫ్యాంటు జిప్పు తీసి చేసిన అంగ ప్రదర్శన.. వైకాపాను వై‘కామ’పార్టీగా మార్చేసింది. ఇప్పటికే శ్రీరెడ్డి, విజయసాయి, అవంతి, అంబటి, మాధవ్, దువ్వాడ నిర్వాకాలతో గబ్బుపట్టిన వైసీపీని.. సోషల్‌మీడియా సైన్యం.. వై‘కామ పార్టీ’, యువజన సెక్సీ రసిక కామాంధుల పార్టీ అంటూ చెడుగుడు ఆడుకుంటోంది. లేటెస్టుగా తెరపైకి వచ్చిన ఎమ్పెల్సీ అనంతబాబు కామకేళి, జగన్ పరువును అడ్డంగా రోడ్డునపడేసింది.

అయితే విజయవాడకు చెందిన ఆ వైసీపీ మహిళా నేతనే, ఎమ్మెల్సీ అనంతబాబుకు హానీట్రామ్ వేసిందన్నది ఒక ప్రచారం. బెజవాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ ఇప్పించడమే కాకుండా, ఆమె గెలుపు కోసం లక్షలు సమర్పించుకున్న అనంతబాబు జేబును, సదరు మహిళా నేత పూర్తిగా కొల్లగొట్టిందన్నది మరో టాక్. ఆ తర్వాత కూడా ఎమ్మెల్సీ బాబు సదరు మిహ ళానేతకు నిరంతరం ‘సమర్పించుకుంటున్నారట’. అయినా సం‘తృప్తి’ చెందని ఆమె.. ఎమ్మెల్సీ రాసలీల వీడియోను లీక్ చేసిందన్నది వై‘కామే’యుల ఉవాచ.

ఈ వీడియో సోషల్‌మీడియాలో లీకైన పుణ్యాన.. ఆ పార్టీ అగ్రనేతల ‘పాత రసిక పురాణాలు’ మళ్లీ చర్చలోకి వచ్చేందుకు కారణమయింది. అనంతబాబు వీడియోతో జగన్‌ను ఫుట్‌బాల్ ఆడేసుకుంటున్న టీడీపీ సోషల్‌మీడియా సైన్యం, వైకాపాను నైతికంగా ఇంకా గబ్బు పట్టిస్తోంది. అనంతబాబు గతంలో మాట్లాడిన వీడియోలను, జగన్ ప్రసంగానికి జతచేర్చి జనంలోకి వదలిన ‘కామా’స్త్రం మర్యాదస్తుల పక్కలో రచ్చ చేస్తోంది. మరి జగనన్న ఈ రసికరాజులను వదిలించుకుంటారా? లేక ‘మీ రసికారాధనకు నా వందనమ’ని, పదవులిచ్చి పెద్దపీట వేస్తారో చూడాలి!