– రూ. 1800 కోట్లకు పైగా ఆదాయం
అమరావతి, మహానాడు: రాష్ట్రంలో శుక్రవారం రాత్రి ఏడు గంటలతో మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు ముగిసింది. ఇప్పటి వరకూ మద్యం దుకాణాలకు రాష్ట్రవ్యాప్తంగా 85 వేల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల ద్వారా ఇప్పటి వరకూ దాదాపు 1800 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 3379 మద్యం దుకాణాలకు దరఖాస్తులను ఎక్సైజ్ శాఖ స్వీకరించింది. ఈ నెల 14వ తేదీన లాటరీ ద్వారా మద్యం దుకాణాల కేటాయించనుంది. అక్టోబరు 15 తేదీ నాటికి దుకాణాలను లాటరీలో దక్కించుకున్న ప్రైవేటు వారికి అబ్కారీ శాఖ అప్పగించనుంది. 16వ తేదీ నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది.