నేటి మధ్యాహ్నానికి నీరు బయటికి వెళ్ళేలా భారీ ఏర్పాట్లు

– మంత్రి నారాయణ

విజయవాడ, మహానాడు: వరద ప్రాంతాల్లో ఇంకా ఉన్న వరద నీరు నేటి మధ్యాహ్నానికి బయటకు వెళ్ళేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు ఏడు గండ్లు ఏర్పాటు. కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిపోయింది. మరో 24 గంటల్లో మొత్తం నీరు బయటికి వెళ్ళిపోయేలా ఏర్పాట్లు చేశాం.

వరద తగ్గిన అన్ని ప్రాంతాల్లో శానిటేషన్ కూడా పూర్తికావస్తుంది. వై నాట్ 175 అన్న పార్టీకి ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కనీసం 10 శాతం సీట్లు రాని వ్యక్తి సీఎం పై విమర్శలు చేస్తున్నారు. జగన్ ఎప్పుడూ ప్రజల్లోకి వెళ్ళలేదు…వారి బాధలు తెలుసుకోలేదు. మా ముఖ్యమంత్రిని ఒక్క మాట అనే అర్హత కూడా జగన్ కు లేదు.

బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అంటే దేశంలో అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబు. జైల్లో ఉన్న వ్యక్తిని పరార్శించడానికి వెళ్లిన సీఎం వరద బాధితుల దగ్గర 5 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. ప్రభుత్వంపై విమర్శలు మానుకుని ఐదేళ్ళు మౌనంగా ఉండాలి. కనీసం ఇప్పుడైనా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే మంచిది. రేపటి లోగా వరద నష్టం అంచనా సుమారు పూర్తి కావస్తుంది. ఈ నెల 17 లేదా 18 నుంచి వరద బాధితులకు పరిహారం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం.